UPDATES  

NEWS

 ఏం జరగబోతుందో తెలియదు.. ఇరుదేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి: ఫరూక్ అబ్దుల్లా..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన వేళ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు, సీనియర్ నేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.

 

మీడియాతో మాట్లాడిన ఫరూక్‌ అబ్దుల్లా, పహల్గామ్ దాడి అనంతరం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. “రేపు ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది” అని అన్నారు. ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

 

అదే సమయంలో, కశ్మీర్‌లో భద్రతా లోపాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఫరూక్‌ అబ్దుల్లా ప్రస్తావించారు. “పహల్గామ్ దాడి జరగడానికి భద్రతా, నిఘా వైఫల్యాలు కూడా కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు” అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించాలంటే, ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, దాని వెనుక ఉన్న శక్తులను వీలైనంత త్వరగా గుర్తించి, పట్టుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యుద్ధ నివారణకు ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |