UPDATES  

NEWS

 రెండూ పార్ట్స్ గా ఓజి..? ఇది నిజమైతే పవన్ ఫ్యాన్స్ డబల్ ధమాకా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు అభిమానుల కోసం వరుస సినిమాలు చేస్తూనే.. మరొకవైపు ప్రజలకు అండగా ఉండాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలా ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న ఈయన.. కష్టం వచ్చినవారికి అండగా నిలబడుతూ తనకంటూ ఒక క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే రాజకీయాల్లో ఉంటూనే తన చేతిలో ఉన్న మూడు సినిమాలను త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి, అభిమానుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన నటిస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలపై అభిమానులు కూడా ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

 

రెండు భాగాలుగా హరిహర వీరమల్లు..

 

అందులో భాగంగానే ఈ సినిమాల షూటింగులు కూడా త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తయింది. మరో నాలుగు రోజులు షూటింగ్ చేస్తే.. సినిమా రిలీజ్ చేయొచ్చని , నిర్మాతలు కూడా కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఈ నాలుగు రోజుల పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ హరిహర వీరమల్లు పార్ట్-1, పార్ట్ -2 ఉంటాయని అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు పవర్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్టు కూడా పార్ట్ 2 గా రాబోతోందని తెలిసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఇక అదేదో కాదు పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ సుజీత్(Sujeeth ) కాంబినేషన్లో వస్తున్న ఓజీ (OG). ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని సమాచారం.

 

ఓజీ పార్ట్ -2 కూడా..

 

అయితే ఇప్పుడు ఈ ఓజీ సినిమా కోసం సుజీత్, అడివి శేష్(Adivi Shesh కలిసి ఓజీ కథను సిద్ధం చేస్తున్న సమయంలోనే పార్ట్ -2 పై కూడా డిస్కషన్ జరిగాయట. ఇక ఓజీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వడంతో ప్రస్తుతం రెండవ భాగం స్టోరీ పై కూడా సుజీత్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఓజీలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్ట్ వన్ క్లైమాక్స్లో అకీరా నందన్ ను ఇంట్రడ్యూస్ చేసి , పార్ట్ 2 లో కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఓజీ పార్ట్ 2 ఉంటుందా లేదా తెలియాలంటే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన,’ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టి ,ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హీరో గానే కాదు మంచి సింగర్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈయన మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం పొందారు. అలాగే తన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించగలరు. ఇలా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |