సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చాలా తక్కువ టైంలో వేయికోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాకు రికార్డు క్రియేట్ చేసింది. ఇక నార్త్ లో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమా ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ హైదరాబాదులో ఉన్న సంధ్య థియేటర్ కి హాజరయ్యాడు. అల్లు అర్జున్ రావడంతో ఒకసారిగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ అక్కడ మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఘటన రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. ఆ తరువాత మద్యంతర్ బెయిల్ రావడంతో అల్లు అర్జున్ తన నివాసానికి వచ్చేసారు. అల్లు అర్జున్ తన నివాసానికి వచ్చేసిన తర్వాత చాలామంది తెలుగు సినిమా ప్రముఖులు వచ్చి అల్లు అర్జున్ డైరెక్ట్ గా కలిశారు. ఈ ప్రక్రియ అంతటినీ కూడా లైవ్ టెలికాస్ట్ చేశాయి మీడియా ఛానల్స్. ఇక్కడతో నెగిటివిటీ మరింత పెరిగింది అని చెప్పాలి.
ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో శ్రీతేజ్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉంటే, చాలామందితో అల్లు అర్జున్ నవ్వుతూ మాట్లాడే విధానం ఇవన్నీ కూడా చాలామందికి ఎబ్బెట్టుగా అనిపించాయి. ఇకపోతే ఈ వివాదం సద్దుమణుకుతుంది అనుకునే టైంలో నేటి అసెంబ్లీ మీటింగ్స్ తో కొత్త దారి ఎంచుకుంది. అల్లు అర్జున్ మీద ఈరోజు అసెంబ్లీలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ ను థియేటర్ వద్దకు రావద్దు అని పోలీసులు చెప్పినా కూడా థియేటర్ వద్దకు వచ్చి సినిమా చూశారు. సినిమా చూసి సైలెంట్ గా వెళ్ళిపోకుండా కార్ రూఫ్ ఓపెన్ చేసి అందరికీ చేతులూపుతూ అక్కడ సీన్ క్రియేట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా థియేటర్ వద్ద జన సందోహం భారీగా ఉంది మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు కోరితే, నేను సినిమా పూర్తిగా చూసినంతవరకు వెళ్ళను అని అల్లు అర్జున్ చెప్పినట్లు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అయితే ఈ మాటలపై అల్లు అర్జున్ నేడు ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ఎవరి పేరును బయటకు తీయలేదు. ఇది అనుకోకుండా జరిగింది. దీనిలో పరోక్షంగా నా తప్పు ఉంది అంటూ తెలిపారు. నామీద చాలా తప్పుడు ఆరోపణలు చేస్తూ నా క్యారెక్టర్ దిగజారుస్తున్నారు. నాకు పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మా మేనేజ్మెంట్ చెప్పడం వలన నేను థియేటర్ లో నుంచి వెళ్లిపోయాను అంటూ అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ వివాదం ఎక్కడతో ముగిసిపోతుంది అని అనుకోవడానికి లేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఈ కేస్ ఆధారపడి ఉంటుంది. ముందు ముందు ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.