ఏపీలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితోపాటు సమానంగా సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా రైతుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. పంట నష్టపోయినవారికి నష్టపరిహారం వెంటనే అందేలా చూడటంతోపాటు వరదలవల్ల, ప్రకృతి విపత్తులవల్ల నష్టపోయిన అన్నదాతలకు కూడా సాధ్యమైనంత వేగంగా పరిహారం సొమ్మును అందజేస్తున్నారు. అలాగే రైతులకు రుణాలు తీసుకోవాలంటే తలకు మించిన భారం అవుతోంది. బ్యాంకులు సవాలక్ష కొర్రీలు పెడుతుండటంతో సాగు పెట్టుబడికి అవసరమైన సొమ్మును పొందలేకపోతున్నారు.
పశుగ్రాసం కొనుగోలుకు
తాజాగా రైతులకు పశువులు ఉంటే వాటికి సంబంధించిన పశుగ్రాసం కొనుగోలు చేసేందుకు కూడా రుణాలు ఇస్తున్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ రుణాన్ని పొందొచ్చు. పశువుల మేత కోసం బ్యాంకు రుణసదుపాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకుంటే రుణం కచ్చితంగా వస్తుంది. రైతులకు సంబంధించి పాన్ కార్డు, ఆధార్ కార్డు, పొలానికి చెందిన పాస్ బుక్, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతోపాటు పశువులు ఉన్నట్లుగా పశు వైద్య అధికారి ద్వారా ఒక ధ్రువీకరణ పత్రాన్ని కూడా తీసుకోవాలి.