UPDATES  

NEWS

 సీఎం జగన్ పైకి రాయి.. ఎడమ కంటికి గాయం..

సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది.బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు.బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్‌ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది.

 

సీఎం జగన్‌ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగ్‌‌నగర్‌లో ఓ ప్రముఖ టీడీపీ నేత ఆఫీస్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ బస్సు యాత్ర సమయంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకుని ఆయనపై దాడికి పాల్పడినట్టు సమాచారం.

 

 

కరెంట్ లేని సమయం చూసి సీఎం జగన్‌పై ఆగంతకులు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు,అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గాయం అయిన కంటికి చికిత్స తీసుకున్న అనంతరం జగన్ తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు.

 

అయితే ఆయన కంటికి కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకుని ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్‌కు వస్తోన్న ఆదరణ తట్టుకోలేక కడుపు మంటతోనే ఈ దాడి చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |