UPDATES  

NEWS

 జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా.. ప్రధాని మోదీ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామని అన్నారు. త్వరలోనే కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని వెల్లడించారు.

 

జమ్ము కశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్ కు రాష్ట్ర హోదా వచ్చిన తర్వాతనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తాను ఎప్పుడు ముందు చూపుతోనే ఆలోచిస్తానని తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్ విషయంలో మీరు చూస్తున్నది కేవలం ట్రైలర్ మాత్రమేనని వెల్లడించారు.

 

ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ ను అద్భుతంగా తీర్చిదిద్ధే పనిలో బిజీగా ఉందన్నారు. కశ్మీర్ లో రానున్న రోజుల్లో అందమైన సినిమాలా చూపిస్తామని మాటిచ్చారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం దగ్గరలోనే ఉందన్నారు.

 

జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత.. ప్రజలు ఎమ్మెల్యే, మంత్రులతో నేరుగా మాట్లడే అవకాశం లభిస్తుందన్నారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను స్వయంగా ప్రజాప్రతినిధులతో పంచుకోవచ్చన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదంపూర్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |