UPDATES  

NEWS

 పుష్ప 2 కోసం పవన్ కళ్యాణ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 2 సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ వచ్చి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి.

 

ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారట. అది ఎలా అంటే ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ లో హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కొన్ని డైలాగులు చెప్పబోతున్నాడట. ఇక పుష్ప రాజ్ కి సంబంధించిన డైలాగ్స్ ను మనం పవన్ కళ్యాణ్ నోటి నుంచి వినబోతున్నాం అన్నమాట. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కి బర్త్ డే రోజు ఆయనకి విషెస్ చెబుతూ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ ని కూడా చేశారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులకు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య కొన్ని విభేదాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

 

కానీ ఇప్పుడు వీళ్లంతా కలిసి పోయారు. ఇక ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మరొకసారి అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ ని చెబుతూ వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని మరింత దగ్గర చేశారు. ఇక ఈ క్రమంలోనే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి మరింత బూస్టప్ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ చేత వాయిస్ ఓవర్ చెప్పిస్తే బాగుంటుందని భావించినట్టుగా తెలుస్తుంది.

 

ఇక తెలుగు వరకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది… పుష్పరాజు క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ వాయిస్ తో ఇచ్చే ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందంటూ ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |