UPDATES  

NEWS

 బెంగళూరులో తీవ్రనీటి సమస్య.. ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ఫైన్.. ఎందుకంటే..

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే ఐటీ సిటీ బెంగళూరులో నీటి కొరతతో అల్లాడుతోంది. రోజురోజుకూ అక్కడ నీటి కరవు పరిస్థితులు పెరుగుతున్నాయి. కనీస నీటి అవసరాలు కూడా తీరని పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితే అధ్వాన్నంగా ఉంటే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. నగరానికి తాగునీటిని సరఫరా చేసే కావేరీ జలాలు ఒకపక్క, బోరుబావులు మరోపక్క అడుగంటి పోవడంతో.. చుక్కనీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. నెలకు ఐదుసార్లు మాత్రమే స్నానాలు చేస్తున్నారు. అంటే సుమారుగా వారానికి ఒకసారి మాత్రమే స్నానం.

 

తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. కొందరైతే సిటీ ఖాళీ చేసి.. సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇంత తీవ్రమైన నీటి కరవులోనూ కొందరూ నీటిని వృథా చేస్తున్నారు. అనవసరంగా నీటిని వాడి.. వృథా చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో ఫిర్యాదు రావడంతో.. ఆదేశాలను ఉల్లంఘించి నీటిని వృథా చేసిన వారికి భారీ జరిమానా విధించారు. 22 కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయల చొప్పున మొత్తం లక్ష 1000 రూపాయిలు ఫైన్ వేశారు.

 

నగరంలో తీవ్ర నీటికొరత ఉండగా.. తాగునీటి సంరక్షణకు ఇచ్చిన ఆదేశాలను 22 కుటుంబాలు అతిక్రమించడంతోనే ఫైన్ వేసినట్లు బెంగళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు వెల్లడించింది. ఫైన్లు విధించిన ఆ 22 కుటుంబాలు తాగునీటిని కార్ వాష్ లకు, చెట్లకు నీరు పోసేందుకు ఉపయోగించారని, దీనివల్ల నీరు వృథా అయిందని తెలిపారు. ఈ క్రమంలో మరోసారి నగరవాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఇంకెలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని నగరవాసులు బెంగపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |