UPDATES  

NEWS

 నాని బర్త్‌డే గిఫ్ట్: సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’.. గ్యాంగ్‌స్టర్‌గా నేచురల్ స్టార్ సరికొత్త అవతారం!

నేచురల్ స్టార్ నాని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్న నాని, తాజాగా తన 32వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేసింది.

ఈ చిత్రంలో నాని రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఒకవైపు శాంతంగా ఉండే చెఫ్‌గా, మరోవైపు పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా నాని నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. గతంలోనే ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. తాజాగా అధికారికంగా టైటిల్ అనౌన్స్ చేయడంతో నాని మరియు సుజీత్ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి లేదా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, 2026 క్రిస్మస్ కానుకగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |