UPDATES  

NEWS

 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి… గెజిట్ విడుదల చేసిన కేంద్రం..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత ఏర్పడింది. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించినట్లయింది.

 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధాని సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. అక్కడ లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో, దీనికి అధికారిక ముద్ర పడింది. ఈ ప్రక్రియలన్నీ పూర్తవడంతో కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

 

2014 నాటి సీఆర్డీయే చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తున్నట్లు ఇందులో స్పష్టం చేసింది. 2024 జూన్ 2వ తేదీ నుంచే ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం తన గెజిట్‌లో పేర్కొంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |