UPDATES  

NEWS

 బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ప్రధాన అంశాలివి..

దేశంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి రావాలన్న సంకల్పంతో ఉన్న బీజేపీ.. మెజార్టీ లోక్ సభ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా.. మోడీ గ్యారెంటీ – 2047 కల్లా వికసిత భారత్ నినాదంతో సంకల్ప్ పత్ర్ పేరుతో మెనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోను రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మందితో కూడిన కమిటీ రూపొందించింది. 15 లక్షల మంది నుంచి సేకరించిన సూచనలతో మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లు జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దేశానికి ఎలాంటి సేవ చేస్తామో ఈ మేనిఫెస్టోలో చెప్పామన్నారు.

 

మేనిఫెస్టో విడుదలకు ముందు.. ప్రధాని మోదీ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. సంకల్ప్ పత్ర్ మేనిఫెస్టోలో యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభివృద్ధికి పెద్దపీట వేసింది బీజేపీ. ముఖ్యంగా రైతులు, పేదలకు ప్రాధాన్యతనిచ్చింది. సామాజిక న్యాయం, సాంస్కృతి, జాతీయవాద అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చింది. 2019లో సంకల్ప పత్రం పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలను బీజేపీ ఎలా అమలు చేసిందో ఈ మేనిఫెస్టోలో వివరించింది.

 

గడిచిన పదేళ్లకాలంలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రాన్ని విడుదల చేసింది. 25 కోట్ల భారతీయులను పేదరికం నుంచి బయటికి తీసుకురావడంతో పాటు.. దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దినట్లు చెప్పింది బీజేపీ. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ లో శాంతిని నెలకొల్పడం, అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట, చంద్రుడి దక్షిధృవంపై కాలుమోపడం, సౌభాగ్య యోజన కింద 100 శాతం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఆహార భద్రత, 4 కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు, 11.8 కోట్ల గృహాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత తాగు నీటి నల్లా కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం, పీఎం కిసాన్ సమృద్ధి యోజన ద్వారా 11 కోట్ల పైగా రైతులకు ఏడాదికి రూ. 6 వేలు ఆర్థిక సహాయం, పీఎం ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 37 కోట్ల లబ్ధిదారులకు ఆరోగ్య బీమా, పీఎం స్వనిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు చేయూత, జన్ దన్ ఖాతాల ద్వారా 51 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలు అందించినట్లు తెలిపింది.

 

బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు

ఉపాధి హామీ

 

రూ.3కోట్లతో లఖ్ పతి దీదీని తయారు చేయడం

 

2036లో ఒలింపిక్స్ నిర్వహణ

 

మహిళా రిజర్వేషన్ల అమలు

 

వ్యసాయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం

 

యోగాకు అధికారిక ధృవీకరణపత్రం అందించడం

 

మత్స్యకారుల కోసం ప్రత్యేక పథకం

 

శ్రామికులకు ఈ-శ్రమ్ ద్వారా సంక్షేమ పథకాల ప్రయోజనాలు

 

70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం

 

చిరువ్యాపారులకు మరిన్ని రుణాలు

 

పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్

 

లారీ డ్రైవర్ల కోసం హైవేల వెంట సదుపాయాలు

 

మరో ఐదేళ్లు అర్హులకు ఫ్రీ రేషన్ అందించడం

 

దేశంలో 6జీ టెక్నాలజీ అమలు, పెట్రోల్ ధరల తగ్గింపు

 

బులెట్ రైళ్ల ఫిజబులిటిపై అధ్యయనం, టూరిజం అభివృద్ధి

 

నూతన రైళ్లు, హైవేలు, ఎయిర్ పోర్టులు, మౌలిక సదుపాయాల కల్పన

 

ప్రతిరంగంలో ఓబీసీ-ఎస్సీ-ఎస్టీలకు గౌరవం

 

2025 గిరిజన్ ప్రైడ్ ఇయర్

 

ప్రపంచ వ్యాప్తంగా రామాయణ మహోత్సవాలు, అయోధ్య అభివృద్ధి

 

వన్ నేషన్, వన్ ఎలక్షన్

 

రైల్వే రిజర్వేషన్లలో వెయిటింగ్ లిస్ట్ సమస్యను తీర్చడం

 

విద్యాసంస్థల్లో భారతీయ భాషలు

 

ఏఐ, సెమీ కండక్టర్, అంతరిక్షరంగాల్లో అభివృద్ధి

 

సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులకు ప్రోత్సాహం

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |