మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ సోమవారం ఆదేశించింది. కాగా మార్చి 28న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.
మంగళవారం కౌంటింగ్ జరగాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జూన్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది.
కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తి అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో నిలిచారు.
మంగళవారం(ఏప్రిల్ 2) తాడో పేడో తేల్చుకుందాం అని ఎదురుచూసిన ఇరు అభ్యర్ధులకు నిరాశ మిగిలింది. విజయం ఎవరిది అని తేలాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే.
Post Views: 37