UPDATES  

NEWS

 దసరా కాంబో రిపీట్.. మాస్ లుక్‌లో నాని ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్..

నేచురల్ స్టార్ నాని డిఫరెంట్ మూవీలతో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తున్నాడు. కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గతేడాది ఏకంగా రెండు సినిమాలతో వచ్చి సూపర్ హిట్లు అందుకున్నాడు. మొదటగా దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తో అందరినీ ఆకట్టుకుంది.

 

దీంతో ఫస్ట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో ప్రేక్షకాభిమానులు థియేటర్లకు పరుగులు పెట్టారు. ఇక మొదటి షో నుంచే మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. అయితే నాని కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా దసరా నిలిచింది. ఈ సినిమాని కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.

 

అలాగే గతేడాది చివర్లో ‘హాయ్ నాన్న’ మూవీతో వచ్చి మరొక హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కడంతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కూడా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. అయితే ఈ మూవీని కూడా కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసి హిట్ కొట్టడం విశేషం.

 

ఎంతో మంది స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమా చేస్తే హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అని ఆలోచిస్తుంటారు. కానీ నాని మాత్రం వాటికి భిన్నంగా ఉంటాడు. కొత్త దర్శకులైనా తనకు కథ నచ్చితేనే సినిమాలు చేస్తున్నాడు. అందువల్లనే హిట్లు కొడుతున్నాడు. అయితే ఇప్పుడు నాని తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించాడు.

 

తాజాగా మరొక కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. తనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరొక సినిమాను ప్రకటించాడు. ‘దసరా’ మూవీ రిలీజ్ అయి ఏడాది గడుస్తున్న సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అందులో నాని ఒక స్టైలిష్ లుక్‌లో కళ్లద్దాలు పెట్టుకుని బీడీ తాగుతూ మాస్ లుక్‌లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేక్స్ రిలీజ్ చేశారు.

 

నాని కెరియర్‌లో 33వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక టైటిల్‌ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఈ అప్డేట్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |