జనసేన పార్టీకి ఏపీ హై కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ జనసేనకే కేటాయించింది. జనసేనకు గాజుగ్లాస్ గుర్తును కేటాయించవద్దని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇటీవలే ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హై కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. నేడు జనసేనకు అనుకూలంగా తీర్పునివ్వడంతో.. జనసేనులంతా ఊపిరి పీల్చుకున్నారు. జనసేనకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
జనసేన పార్టీ గుర్తయిన గాజు గ్లాసును ఈసీ ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఆ గుర్తును తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయించడంపై మరో రిట్ పిటిషన్ కూడా వేసింది. రెండు పిటిషన్ల పై విచారణ చేసిన హైకోర్టు.. ఆ గుర్తును ఎన్నికల కమిషన్ జనసేనపార్టీకి కేటాయించడంతో.. జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేయడంతో.. జనసేన భారీ ఊరట లభించినట్లైంది.
గాజుగ్లాసు గుర్తు పార్టీకి దక్కకపోతే.. భారీ ఎదురుదెబ్బ ఖాయమని జనసైనికులు ఆందోళనలో ఉన్న క్రమంలో.. హైకోర్టు తీర్పు ఊరటనిచ్చంది. కోర్టు తీర్పుతో జనసేన గాజుగ్లాసు గుర్తుపైనే పోటీ చేసే అవకాశం లభించింది.