తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వ్యవహారంపై తాను హైకోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఒక మంత్రిపై కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తానన్నారు. అబద్ధపు ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. ఈ కేసులో పూర్తిగా నిజానిజాలు తెలియకుండా నెగిటివ్ గా న్యూస్ వేస్తున్న వారికి కూడా లీగల్ నోటీసులు పంపుతామని చెప్పారు.
మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన సస్పెండెడ్ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 5 రోజులపాటు వారిద్దరికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. పోలీసులు ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. విచారణలో వీరిద్దరి నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు.. దానిని కోర్టు ముందు ఉంచారు. ఇందులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ నేడు అమెరికా నుంచి హైదరాబాద్ కు రానున్నారు. ఆయనకో పాటు.. ఆయన ఫోన్ ను కూడా విచారిస్తే.. కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంది.