ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. రేపే రాబోతుంది అని పాడేసుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. బన్నీ బిగ్ స్క్రీన్ పై కనిపించి దాదాపు మూడేళ్ళ దాటింది. సోషల్ మీడియాలోనో.. బయట ఈవెంట్స్ లోనో కనిపించిన తీరు వేరు.. థియేటర్ లో బన్నీ కనిపించడం వేరు అనేది ఫ్యాన్స్ ఆవేదన. ఇక సమయం వచ్చేసింది. పుష్ప 2 తో పుష్పరాజ్ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో 2021 లో పుష్ప సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బన్నీ జీవితాన్నే మార్చేసింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చింది. మొట్టమొదటి నేషనల్ అవార్డు ను అందించింది. ఇన్ని చేసిన సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ రికార్డులు సృష్టించాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టడానికి ముహూర్తం పెట్టారు. పుష్ప మాస్ జాతర రేపటి నుంచే మొదలుకానుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. రేపు పుష్ప 2 నుంచి ఒక పెద్ద అనౌన్స్ మెంట్ రాబోతుందని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఆ అనౌన్స్ మెంట్ ఏంటి అనేది తెలియకపోవడంతో.. ఎప్పుడెప్పుడు రేపు అవుతుందా.. ? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 5 న రష్మిక పుట్టినరోజు పోస్టర్, ఏప్రిల్ 7 న న్యూ గ్లింప్స్ వీడియో, ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. మరి ఇందులో నిజమెంత నేది తెలియాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. మరి ఈ సినిమాతో బన్నీ- సుకుమార్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.