UPDATES  

NEWS

 ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్‌కు రంగం సిద్ధం.. ముఖ్య అతిథులు వీరే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా ‘KALKI 2898AD’ . వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హాలీవుడ్ మూవీలను తలపించేలా ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉండబోతున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో గ్రాండ్‌గా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

 

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఒకెత్తయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మరో ఎత్తు అనే చెప్పాలి. ఈ ట్రైలర్ హాలీవుడ్ మార్వెల్ మూవీస్ రేంజ్‌లో ఉంటూ సినీ ప్రేక్షకుల్ని, రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అదీగాక ఈ ట్రైలర్‌లో ప్రభాస్ లుక్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. అచ్చం మార్వెల్ హీరోలా సేఫ్టీ సూట్ ధరించి అదిరిపోయాడు. ప్రభాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

దీంతో ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రేక్షకాభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ నెల అంటే జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే స్టార్ హీరోలతో ప్రభాస్ ‘బుజ్జి’ కారును డ్రైవ్ చేయిస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

 

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. చిత్రబృందం త్వరలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కి స్టార్ హీరోలను సైతం గెస్టులుగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందట. అంతేకాకుండా ఒక ఈవెంట్‌గా కాకుండా మూడు ఈవెంట్‌లుగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట. అందులో ఒక ఈవెంట్‌ను జూన్ 23న ఏపీలోని అమరావతిలో నిర్వహించబోతుందని సమాచారం.

 

ఆ తర్వాత చెన్నై, తర్వాత డిల్లీలో ఈవెంట్‌లను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |