రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమా కన్నా ఎక్కువగా అతడు ప్రమోషన్స్ ఎలా చేస్తున్నాడు అనేదే అభిమానులు చూస్తారు. టాలీవుడ్ లో డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయడంలో విజయ్ తరువాతనే ఎవరైనా అని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ్.. ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన విజయ్.. అన్ని స్టేట్స్ ను కవర్ చేస్తున్నాడు.
ఇక తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో విజయ్.. రిపోర్టర్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇంటర్వ్యూ కి వెళ్ళినా కూడా మొట్టమొదట అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు..? అనే. ఇప్పుడు చెన్నైలో కూడా రిపోర్టర్ అదే ప్రశ్న అడిగాడు. ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు విజయ్.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. నాక్కూడా పిల్లలను కనాలని ఉంది.. కానీ ఈ ఏడాది కాదు అని సమాధానం ఇచ్చాడు. లవ్ మ్యారేజ్ నా అన్న ప్రశ్నకు తడుముకోకుండా విజయ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.. కానీ ఆ అమ్మాయి మా ఇంట్లో వాళ్లకు నచ్చాలి అన్నాడు.
ఇంకా ఇది కాకుండా తనకు ఇష్టమైన హీరోయిన్స్ గురించి చెప్పమంటే రష్మిక గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమాధానాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక విజయ్ లవ్ మ్యారేజ్ అనగానే అందరూ రష్మిక తోనే లవ్ లో ఉన్నాడు కదా ఆమెనే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యనే రష్మిక సైతం తనకు విజయ్ లాంటి భర్త కావాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో విజయ్ కూడా లవ్ మ్యారేజ్ అని అంటున్నాడు, దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఇంకోసారి అభిమానులు గుసగుసలాడుతున్నారు. మరి త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్తుందేమో చూడాలి.