అవినాష్ రెడ్డి తండ్రి ,వైఎస్ భారతి మేనమామ,వైఎస్ భాస్కర రెడ్డి అరెస్ట్

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు ఉదయం సి.బి.ఐ వైఎస్ భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేసింది. వైఎస్ భాస్కర రెడ్డి ,అవినాష్ రెడ్డి తండ్రి ,వైఎస్ భారతి మేనమామ. ఇతని బార్యకు 120B కుట్ర, రెడ్ విత్ 302 హత్య ,201 సాక్ష్యాలు చెరిపివేయడం ,క్రింద అరెస్టు మెమో ఇచ్చారు .పులివెందుల లో అరెస్టు చేస్తున్నపుడు ఊహించినట్టు ప్రజల నుండి ప్రతిఘటన కనిపించలేదు.

*కడపలో ఉ.5.30 గంటల సమయంలో భాస్కర్‌ రెడ్డి ఇంట్లోకి సీబీఐ బృందం.

*ఉ.6.10 నుంచి భాస్కర్‌ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ.

* భాస్కర్‌ రెడ్డి ఇంట్లోకి ఎవరినీ అనుమతించని సీబీఐ.

*లాయర్‌ను అనుమతించాలని భాస్కర్‌రెడ్డి వినతిపై స్పందించని సీబీఐ.

*వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి ను అరెస్ట్ చేశాము – సీబీఐ.

*సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాం – సీబీఐ.

*సెక్షన్ 120 B , రెడ్ విత్ 302 , 302 ఐపీసీ కింద కేసు నమోదు.

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది వివేకా హత్య కు ముందు తరువాత నిందితులకు భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడాడు అంది సీబీఐ.

Facebook
Twitter
WhatsApp
Telegram

తాజా వార్తలు :

Subscribe !