విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై గంటకో మాట మారుస్తున్న కేంద్ర వైఖరిని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
కేంద్ర ఉక్కు మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఉదయం ఒక ప్రకటన, మధ్యాహ్నానికి మరో ప్రకటన చేయటం మోడీ సర్కార్ ద్వంద నీతికి తార్కాణం.
విశాఖ ఉక్కుపై కేంద్రం పదే పదే మోసం చేస్తున్న విషయం స్పష్టమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం తగదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి.
తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు, యూనియన్లను ఏపీకి చెందిన ఎంపీలను ఆహ్వానించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
– రామకృష్ణ.