లోకేష్ కష్టం చూసి తనకు బాధ కలుగుతుందని జెసి ప్రభాకర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడు

అనంతపురం నగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాదయాత్రలో చిరునవ్వుతో ప్రజలను పలకరిస్తూ ప్రజలనేతగా తనను తాను మలుచుకుంటున్నారన్నారు. భవిష్యత్ తరాల బాగు కోసం లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు మండుతున్న ఎండలను లెక్క చేయక నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర ప్రజల స్థితి గతులను మారుస్తుందని రానున్న ఎన్నికల్లో అందుకు అనుగుణంగా ప్రజాతీర్పు ఉండబోతోందన్నారు. ప్రజల బాధలు, కన్నీటి కష్టాలను కళ్ళారా చూస్తూ బాధిత కుటుంబాలను ఓదారుస్తూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న పాదయాత్ర చారిత్రాత్మక విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ నారా లోకేష్ వెంట ఉన్నారని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయIమన్నారు.లోకేష్ తన కొడుకు లాంటి వాడని పాదాలకు గాయాలయినా నడుస్తున్నాడని ,అతని కష్టం చూసి తనకు బాధ కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు

Facebook
Twitter
WhatsApp
Telegram

తాజా వార్తలు :

Subscribe !