తమిళనాడులోని దిండిగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మణికందన్ పై పోలీసులు కేసు నమోదు

తమిళనాడులోని దిండిగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మణికందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన న్యాయమూర్తి నాలుక కోసేస్తామని మణికందన్ హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై కేసు నమోదు అయింది.

Chop off” judge’s tongue: కేసు నమోదు..

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ గుజరాత్ లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే, ఈ తీర్పును ఆధారంగా తీసుకుని రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. దాంతో, కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. పలు విపక్ష పార్టీలు కూడా రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని దిండిగల్ లో ఏప్రిల్ 6వ తేదీన కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మణికందన్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీని దోషిగా తేల్చి,జైలు శిక్ష వేసిన గుజరాత్ న్యాయమూర్తి నాలుకను కోసేస్తామంటూ ఆయన ఆ ప్రసంగంలో హెచ్చరించారు. ‘ ఈ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదు రావడంతో దిండిగల్ పోలీసులు మణికందన్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153బీ ప్రకారం కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని దిండిగల్ పోలీసులు తెలిపారు.

Chop off” judge’s tongue: 2019 కేసు..

2019 ఏప్రిల్ లో కర్నాటకలోని కోలార్ లో ఒక సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ వంటి అవినీతిపరుల ప్రస్తావన తెస్తూ.. దొంగలందరి ఇంటి పేరు మోదీనే ఉంటుందా? అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై గుజరాత్ లో పరువునష్టం కేసు నమోదైంది. ఆ కేసు లోనే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష, ఆ తరువాత అనర్హత వేటు పడింది.

Facebook
Twitter
WhatsApp
Telegram

తాజా వార్తలు :

Subscribe !